మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రొసుకు,
పొదాం, పొదాం, పై పైకి!
కదం త్రొక్కుతు,
పదం పాడుతు,
హృదంతరాలం ఘర్జిస్తు
పదండి పొదాం,
వినబడలేద
మరొ ప్రపంచపు జలపాతం ?
దారిపొడుగునా గుండె నెత్తురులు,
తర్పణ చెస్తు పదండి ముందుకు!
బాటలు నడిచి,
పెటలు గడిచి,
కొటలన్నిటిని దాటండి!
నది నదాలు,
అడవులు కొండలు,
ఎడారుల మనకడ్డంకా?
పదండి ముందుకు!
పదండి త్రొసుకు!
పొదాం, పొదాం పై పైకి!
ఎముకులు కృళ్ళిన,
వయసు మళ్ళిన,
సొమరులార చావండి!
నెత్తురుమండె,
శక్తులు నిండె,
సైనుకులార! రా రాండి!
హరోం హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హర" అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం,
ధరిత్రినిండ నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రొసుకు!
ప్రభంజనం వలె హోరెత్తింది!
భవవేగమ్మున ప్రసరించండి.
వర్షకభ్రమ్ముల ప్రళయఘొషవలె
ఫెల ఫెల ఫెల ఫెల విరుచుకు పదండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనపడలెద మరో ప్రపంచపు
కణకణ మండె త్రేతాగ్ని ?
ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నాయి,
ఎనభై లక్షల మెరువులు!
తిరిగి తిరిగి తిరిగి సముద్రాల,
జలప్రళయ నాట్యం చెస్తున్నాయి!
సల సల క్రాగె చముర కాదిది,
ఉష్న రక్త కాసారం!
సివసముద్రము,
నయగరవలె,
ఉరకండి! ఉరకండి ముందుకు!
పదండి ముందుకు!
పదండి త్రొసుకు!
మరొ ప్రపంచపు కంచు నగారా.
వీరామమెరుగుక మ్రొగింది!
త్రాచులవలెను,
రెచులవలెను,
దనంజయునిల సాగండి.
కనబడలెద మరొప్రపంచపు
అగ్నికిరీటపు దగధగలు,
ఎర్రబవుట నిగనిగలు,
హొమజ్వాలల భుగభుగలు ?
No comments:
Post a Comment