చిరునవ్వుతో చిరునవ్వుతో .. చిరునవ్వుతో

చిత్రం : చిరునవ్వుతో (2000)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్. పి. బాలు

Title Song..

ప్రతిరోజునీ ప్రభవించనీ
చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి ఊహని బ్రతికించుకో
చిరునవ్వుతో చిరునవ్వుతో
రురూ రురురురురూ రురురురురూ రురురురురూ

ప్రతి మనిషిని పరికించరా
చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి రాత్రిని పవళించనీ
చిరునవ్వుతో చిరునవ్వుతో
రురూ రురురురురూ రురురురురూ రురురురురూ

ప్రతి రోజూ ప్రారంభించు చిరునవ్వుతో
ప్రతో రోజూ గడుపు చిరునవ్వుతో
ప్రతి రోజూ ముగించు చిరునవ్వుతో
గతమన్నది గతమేను రా
వ్యధ చెందకు విలపించకు
విధి ఆటలో కష్టాలకు
కడ ఏదిరా దుక్కించకు
రురూ రురురురురూ రురురురురూ రురురురురూ

తలరాతనే ఎదిరించారా
చిరునవ్వుతో చిరునవుతో
మునుముందుకే అడుగేయరా
చిరునవ్వుతో చిరునవ్వుతో

No comments: