రా ముందడుగేద్దాం - కంచె

సంగీత దర్శకుడు : చిర్రన్తన్ భట్ట్ 
గాయకులు : విజయ్ ప్రకాష్ , హీర్తి సగాతియా 
రచన : సిరి వెన్నెల సీతారామ శాస్త్రి


నీకు తెలియనిదా నేస్తమా చెంత చేరననే పంతమా
నువు నేనని విడిగా లేమని ఈ నా శ్వాసని నిను నమ్మిన్చని

విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా
అడిగావ భుగోలమా నువ్వు చూసావా ఓ కాలమా

రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం
రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేదం సాదిన్చేదేముంది ఈ వ్యర్ధ విరోధం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం  రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం   || రా ముందడుగేద్దాం ||


 అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం  చెంత చేరననే పంతమా
ఖండాలుగ విడదీసే జండాలన్ని తలవంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందాం || రా ముందడుగేద్దాం ||

No comments: