చల్ చలో చలో - S/O సత్యమూర్తి

గానం: రఘు దీక్షిత్, సాఖి, సూరజ్ సంతోష్
రచన:రామజోగయ్య శాస్త్రి
సంగీతం: దేవిశ్రీప్రసాద్

రాజ్యం గెలిసినోడు రాజవుతాడూ రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడూ
యుద్ధం గెలిసేటోడు వీరుడు, శూరుడూ యుద్ధం ఇడిసేటోడే దేవుడూ




చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించుదారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో
తీపితోపాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటె బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈక్షణాన్ని       || చల్ ||

 


 కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తీయగుంటే కడదాకా వదలవుగనక
కష్టాలెందుకు బరువుగుంటాయ్ తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవుగనక
ఎదురేలేని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటిగడపదాక
పడ్డవాడే కష్టపడ్డవాడే పైకిలేచే ప్రతోడూ
ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు
  || చల్ ||


మడతేనలగని షర్ట్ లాగా అల్మరాలో పడివుంటే అర్ధంలేదు
గీతేతగలని కాగితంలా ఒట్టిచెదలు పట్టిపోతే ఫలితం లేనేలేదు
ప్లస్సుకాదూ, మైనస్సుకాదూ అనుభవాలే ఏవైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపుదారిలోన      || చల్ ||

No comments: