భగ భగమని - కంచె

భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో
ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో
ఏ పంటల రక్షనికీ కంచెల ముళ్ళు
ఏ బ్రతుకుని పెంచుటకీ నెత్తుటి జల్లు
ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు
ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు
ప్రాణమే పనమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎప్పుడు ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
కొత్తదే ఎపుడు మేలుకొలుపు మేలుకొలుపు
అంతరాలు అంతమై అంతా ఆనందమై
కలసి మెలసి మెలిగే కాలం చెల్లిందా
చెలిమి చినికు కరువై పగల సెగల నెలవై
ఎల్లలతో పుడమి వొళ్ళు నిలువుగా చీలిందా
నిశి నిషాద గరోన్ముక్త దురిత శరా ఘాతం
మృదులాలస స్వప్నాలస ధృక్కపోత పాతం
మృదువ్యదార్త పృథ్వి మాత నిర్గోశిత చేదం
నిష్టుర నిష్మాసంతో నిశ్చేష్టిత గీతం
ఏ విష బీజొధ్బూతం ఈ విషాద భూజం
ప్రాణమే పనమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎప్పుడు ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
కొత్తదే ఎపుడు మేలుకొలుపు మేలుకొలుపు
భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో
ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో

బొంబాయి ప్రియుడు - గుప్పెడు గుండెను తడిపే



సంగీతం : ఎం ఎం కీరవాణి 
వ్రాసినది : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
పాడినవారు : S.P. బాలు , చిత్ర
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..

రా ముందడుగేద్దాం - కంచె

సంగీత దర్శకుడు : చిర్రన్తన్ భట్ట్ 
గాయకులు : విజయ్ ప్రకాష్ , హీర్తి సగాతియా 
రచన : సిరి వెన్నెల సీతారామ శాస్త్రి


నీకు తెలియనిదా నేస్తమా చెంత చేరననే పంతమా
నువు నేనని విడిగా లేమని ఈ నా శ్వాసని నిను నమ్మిన్చని

విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా
అడిగావ భుగోలమా నువ్వు చూసావా ఓ కాలమా

రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం
రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేదం సాదిన్చేదేముంది ఈ వ్యర్ధ విరోధం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం  రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం   || రా ముందడుగేద్దాం ||


 అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం  చెంత చేరననే పంతమా
ఖండాలుగ విడదీసే జండాలన్ని తలవంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందాం || రా ముందడుగేద్దాం ||

చల్ చలో చలో - S/O సత్యమూర్తి

గానం: రఘు దీక్షిత్, సాఖి, సూరజ్ సంతోష్
రచన:రామజోగయ్య శాస్త్రి
సంగీతం: దేవిశ్రీప్రసాద్

రాజ్యం గెలిసినోడు రాజవుతాడూ రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడూ
యుద్ధం గెలిసేటోడు వీరుడు, శూరుడూ యుద్ధం ఇడిసేటోడే దేవుడూ




చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించుదారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో
తీపితోపాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటె బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈక్షణాన్ని       || చల్ ||

 


 కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తీయగుంటే కడదాకా వదలవుగనక
కష్టాలెందుకు బరువుగుంటాయ్ తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవుగనక
ఎదురేలేని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటిగడపదాక
పడ్డవాడే కష్టపడ్డవాడే పైకిలేచే ప్రతోడూ
ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు
  || చల్ ||


మడతేనలగని షర్ట్ లాగా అల్మరాలో పడివుంటే అర్ధంలేదు
గీతేతగలని కాగితంలా ఒట్టిచెదలు పట్టిపోతే ఫలితం లేనేలేదు
ప్లస్సుకాదూ, మైనస్సుకాదూ అనుభవాలే ఏవైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపుదారిలోన      || చల్ ||

ఏం సందేహం లేదు -- ఊహలు గుస గుసలాడే...

చిత్రం : ఊహలు గుస గుసలాడే...
పాట : అనంత శ్రీరాం
పాడిన వారు : సునీత, కళ్యణి కోడూరి

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలవని కాలిలాగ
మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖా....
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది


వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్లల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా....
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే


నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గాని ఏమైనా అయిపొనీ ఏం పర్వాలేదన్నావా
అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుకా
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా.....
హ్మ్... హ్మ్.. హ్మ్... హ్మ్..
హ్మ్... హ్మ్.. హ్మ్... హ్మ్..

ఎటెల్లినా అరన్యమే -- దళం (విజయ్ యేసుదాసు)

*****************************
చిత్రం : దళం 
పాట : సిరివెన్నెల సీతరామ శాస్త్రి
పాడిన వారు : విజయ్ యేసుదాసు 

*****************************

ఎటెల్లినా అరణ్యమే  స్తితీ గతీ అగమ్యమే విషాదయోగమైంది జీవితం
నిరీహలో నిద్రానమై నిరీక్షణం నిరాధమై నిషీది నింపుకుంది దృక్పదం
అకాల మ్రుత్యు పాషమై త్రికాల రక్త పాతమై చితాగ్ని చిమ్ముతోంది గంగళం
వసంతమే నిషిద్దమై దళం దళం విదద్దమై విషీర్నమైంది ప్రాణ పరిమళం 
బ్రతుకే బరువై దారి దొరుకని పరుగై సుడులే తిరిగే పయనం
బ్రతుకే బరువై దారి దొరుకని పరుగై సుడులే తిరిగే పయనం


 ॥ ఎటెల్లినా అరణ్యమే ॥ 

సజీవ శవసమూహమై 
సమాదులకు నివాసమా 
శిలాజమైన నవ సమాజమా
అనంతమైన శూన్యమా 

అనర్దమైన ధైర్యమా  
జవాబు చెప్పవేమి సంగమా
వృదాస్యు జన ప్రవాహమా 

వ్యదార్ద జన ప్రవాసమా 
ఇదే ప్రజా ప్రబుత్వ దేశమా
అరాచకాల నిలయమా 

వినాషకాల విలయమా 
పునాధిలేని భవిత భవనమా

కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం.....
కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం.....

ఓం సర్వాణి ఓం రుద్రాణి -- లెజండ్ .

+++++++++++++++++++++++
లెజండ్ 2014. 
పాడినది : మానసి 
వ్రాసిన వారు : రామ జోగయ్య శాస్త్రి 
+++++++++++++++++++++++

ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం 
ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం

||ఓం సర్వాణి||

పావనీ జీవతరణి పాప సంతాపహారిణి 
నీ కృపా చైత్రసుధని మాపైన వర్షించనీ
శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి 
చింతలవంతగనని చిరశాంతి వెలసిల్లనీ
శ్రీ  చక్రాణ అమ్మవై ఉన్న ఆది నారాయణి 
నీ వాత్సల్యమాశ్వాదించణి మనుసుని

||ఓం సర్వాణి||

సద్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి
సత్య సుభషిని సరసిజొహసిని శంభుసతీ ఆ..
విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి 
ఆత్మ విలాసిని  ఆర్త పరాయిని అమృత వర్షిని వేదవతి
శూల ధారిణీ శైల విహారిణి మ ఫాహి దేవి చిదానంద రూపిణి

||ఓం సర్వాణి||

భగవతి భర్గవి భైరవి భ్రమరి మారి మణొహరి మూకాంబే..
భక్తవశంకరి భవనాశంకరి పరమ శివంకరి దుర్గాంబే ఆ...
ఓంకారేశ్వరీ వరభీజాక్షరి మాన్విమహేశ్వరి జగదాంబే 
శ్రి పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఛాముండేశ్వరి భ్రమరాంభే..
రౌద్రకళి యోగమరాళి మాం పాహి గౌరిశివానంద లహరి
ఓం కరుణాక్షి ఓం పరినాక్షి ఓం నళినాక్షి వందనం
ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం..

కోకిలమ్మ కొత్తపాట పాడింది .....సుందరకాండ


చిత్రం : సుందరకాండ 
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
************************************

కోకిలమ్మ కొత్తపాట పాడింది
కూనలమ్మ కూచిపూడి ఆడింది
సందెపొద్దు నీడ అందగత్తె కాడ
సన్నజాజి ఈల వేయగా
అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా ॥మావా॥
పక్కపాపిడెందుకో...
పైట దోపిడెందుకే
మగడా ఎడాపెడా గడీ పడగానే ॥మావా॥
 
పూలచెట్టు గోలపెట్టు తేనెపట్టులో నీ గుట్టు తీపిగున్నది
పైటగుట్టు బైటపెట్టు చేతిపట్టులో నీ కట్టు జారుతున్నది
కొత్తగుట్టు కొల్లగుట్టు కోకోనట్టులో
రాబట్టు కొబ్బరున్నది
దాచిపెట్టి దోచిపెట్టు చాకులెట్టులో
బొబ్బట్టు మోతగుందది
బుగ్గలో మొగ్గలే నువ్వు దగ్గరైతే విచ్చుకుంటానయ్యో
నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే
పుచ్చుకుంటానమ్మో
వరసే నిలు కలు కొలు అనగానే ॥మావా॥

కన్నుగొట్టి రెచ్చగొట్టు కాకపట్టులో
కాల్‌షీటు నైటుకున్నది
పాలుపట్ట్టి పండబెట్టు పానిపట్టులో
బెడ్‌షీటు బెంగపడ్డది
బెడ్డులైటు తీసికట్టు గుడ్డునైటులో
కుర్ర ఈడు కుంపటైనది
ఉట్టికొట్టి కత్తిపట్టు జాకుపాటులో
ఆటుపోటు అక్కడున్నది
ఒంపులో సొంపులో నిన్ను బొత్తుకుంటే
మొత్తుకుంటావమ్మో
చెప్పినా చేసినా నీది కాని నాది ఎక్కడుంటావయ్యో
హజలే చెలి అనార్కలి అనగానే... ॥మావా॥


వేణువై వచ్చాను భువనానికి.. మాతృదేవోభవ


చిత్రం : మాతృదేవోభవ (1994)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి సుందరరామ మూర్తి
గానం : చిత్ర
**********************************************
వేణువై వచ్చాను భువనానికి..
గాలినై పోతాను గగనానికి..
వేణువై వచ్చాను భువనానికి..
గాలినై పోతాను గగనానికి..
మమతలన్ని మౌన గానం..
వాంఛలన్నీ వాయులీనం..(వేణువై)

మాతృదేవోభవ(మాతృదేవో భవ)
పితృదేవోభవ(పితృదేవో భవ)
ఆచార్యదేవోభవ(ఆచార్యదేవో భవ)

ఏడు కొండలకైన బండ తానొక్కటే..
ఏడు జన్మల తీపి ఈ బంధమే..(2)
నీ కంటిలో నలత లో వెలుగునే కనక..
నేను మేననుకుంటే ఎద చీకటే..
హరీ..(౩)
రాయినై ఉన్నాను ఈ నాటికి..
రామ పాదము రాక ఏ నాటికి..(వేణువై)

చిరునవ్వుతో చిరునవ్వుతో .. చిరునవ్వుతో

చిత్రం : చిరునవ్వుతో (2000)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్. పి. బాలు

Title Song..

ప్రతిరోజునీ ప్రభవించనీ
చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి ఊహని బ్రతికించుకో
చిరునవ్వుతో చిరునవ్వుతో
రురూ రురురురురూ రురురురురూ రురురురురూ

ప్రతి మనిషిని పరికించరా
చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి రాత్రిని పవళించనీ
చిరునవ్వుతో చిరునవ్వుతో
రురూ రురురురురూ రురురురురూ రురురురురూ

ప్రతి రోజూ ప్రారంభించు చిరునవ్వుతో
ప్రతో రోజూ గడుపు చిరునవ్వుతో
ప్రతి రోజూ ముగించు చిరునవ్వుతో
గతమన్నది గతమేను రా
వ్యధ చెందకు విలపించకు
విధి ఆటలో కష్టాలకు
కడ ఏదిరా దుక్కించకు
రురూ రురురురురూ రురురురురూ రురురురురూ

తలరాతనే ఎదిరించారా
చిరునవ్వుతో చిరునవుతో
మునుముందుకే అడుగేయరా
చిరునవ్వుతో చిరునవ్వుతో

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా... చిరునవ్వుతో

చిత్రం : చిరునవ్వుతో... (2000)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం 

పల్లవి :
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!

చరణం : 1
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
॥ నిన్నటి ॥
చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా 
లేనిపోని సేవచేయకు
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా 

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!

చరణం : 2
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
॥ఆశలు ॥
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ 
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ 
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
॥ సంతోషం ॥

జాబిల్లి నువ్వే చెప్పమ్మా - రామయ్య వస్తావయ్య

స గ మ ప మ ప గ రి రి గ రి
స గ మ ప మ ప గ రి రి గ రి
గ రి స రి స ని స
స రి స

జాబిల్లి నువ్వే చెప్పమ్మా ..నువ్వే చెపమ్మా
ఈ పిల్లే వినడం లేదమ్మ..అబ్బే వినదమ్మ
ఓ చుక్క నువ్వె చూడమ్మ..నువ్వే చుడమ్మా
మి అక్కని మాటడించమ్మ
మెగల పైనుంది వస్తార ఓ సారి
రాగలే తియ్యంగా. తియ్యగా..
చిరుగాలె అమ్మయి..ఉయ్యాలై ఈ రేయి
జొ లాలి పాదలి హాయిగా...
 || జాబిల్లి నువ్వె చెప్పమ్మ||

నలుపెక్కిన మబ్బులోన నలుదిక్కుల ఓ మూలైన
కల్లె మెరుపల్లె తుల్లే తుల్లే
వడగాలుల్ల వెసవిలోన చాల చల్లగ ఓ నాదైన
జల్లె చినుకుల్నె జల్లె జల్లె
ప్రానంకన్న ప్రెమించే ని వాల్లు ఉన్నరె
ఆననందం అందించి అందాలె చిందాలె
ఆపైన ఉన్నోల్లు తెపైనా మనవాల్లు
అదిగెది ని నవ్వులే

చిరునవ్వు నవ్వవంటె పొరపటని ఎవరంటారె
పిట్ట నవ్వె వడంతె యెట్ట
సర్దాగ కసెపుంటె సరికాదని దెప్పెదెవరే
ఇట్ట ఇస్థవ వారి చిత్తా
కొమ్మ రెమ్మ రమ్మంటె నీతొ వచేవా
కరంగ మారంగ కొరిందే ఇచేవా
ని తొటి లెనుల్లొ ని చుట్టూ ఉన్నరు
కల్లర ఓ సారి చుడవే

స గ మ ప మ ప గ రి రి గ రి
స గ మ ప మ ప గ రి రి గ రి
గ రి స రి స ని స
స రి స

 || జాబిల్లి నువ్వే ||

వీడు ఆరడుగులు బుల్లెట్టు - అత్తారింటికి దారేది

గగనపు వీది నుండి వలస పోయిన నీలి మబ్బు కొసం 
తరలింది తనకు తానె ఆకసం... పరదేసం...
శిఖరపు అంచు నుంచి నేల జారి పొయిన నీటి చుక్క కొసం 
విడిచింది చూడు తన రథమే తన వాసం... వనవాసం.. 
భైరవుదో బార్గవుదో భస్కరుదో మరి రక్కసుడో 
ఉక్కు తీగ లాంటి ఒంటి నైజం
వీదు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుదో తక్షకుదో పరీక్షలకే సుసిక్షితుడో 
శత్రువంటు లేని వింత యుద్ధం 
ఇది గుండెలోతు గాయమైన సిద్ధం 
నడిచొచే నర్తన సౌరి 
పరిగెత్తే పరాక్రమ సైలి 
హలాహళం భరించిన కర్క హృదయుడొ 
వీడు ఆరడుగులు బుల్లెట్టు 
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు 

| గగనపు వీది |

దివి నుంచి బువి పైకి భగభగమని కురిసేటి 
వినిపించని కిరనం చప్పుడు వీడు 
వడి వడిగా వడగల్లై గడగడ మని జారెటి 
కనిపించని జడి వానెగా వీడు
సంకం లొ దాగెటి పొటెత్తిన సంద్రం హొరితడు 
శొకానె దాటెసె అశొకుడు వీడురో 
 || వీడు ఆరడుగుల ||

తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చొటుని చుపిస్తాదు 
తన దిసనే మార్చుకుని ప్రబవించె సుర్యుడికి 
తన తూరుపు తరిపెవెచెస్తాడు 

రావనుడో రాఘవుడో మనసును దోచే మానవుడో
సైనికుడో స్రామికుడో అసాద్యుడు వీడురో 
 || వీడు ఆరడుగుల ||


|| గగనపు వీది ||
విడిచింది చూడు నగమే తన వాసం... వనవాసం...  

నిలువద్ధము నిను ఎపుడైన - నువ్వొస్తానంటే నెనొద్దంటానా

నిలువద్ధము నిను ఎపుడైన నువు ఎవ్వరు అని అడిగేన
ఆ చిత్రమె గమనిస్తున్న కొత్తగా
నువు విన్నధి నీ పేరైన నిను కాదని అనిపించేన
ఆ సంగతి కనిపెడుతున్న వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేన అనుకుంటున్న
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరెనా
అధి నువ్వే అని నువ్వే చెపుతువున్న
లల లల లైలైలే లల లల లైలైలే  (2)

నిలువద్ధము నిను ఎపుడైన నువు ఎవ్వరు అని అడిగెన
ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా………
హా..ప్రతి అడుగు, తనకు తానే
సాగింది నీ వైపు నా మాట విన్నంటూ
నే నాపలెనంతగ
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
నీ కోతి చిందుల్ని నట్యాలుగ మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచరు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకొ ఆ నింద నాకెందుకు
లల లల లైలైలే లల లల లైలైలే (2)

నిలువద్ధము నిను ఎపుడైన నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా
హా..ఇదివరకు, యెదలయకు
యె మాత్రములెదు హోరేత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు, నను అడుగు
చెపుతను పటాలు నీ లెత పాదాలు జలపడమయ్యెట్టుగ
నా దారినే మరిలించగ నీకెందుకే అంత పంతం
మన చెతిలొ ఉంటె కదా ప్రేమించటం ఆగటం                                        
లల లల లైలైలే లల లల లైలైలే (2)

నిలువద్ధము నిను ఎపుడైన నువు ఎవ్వరు అని అడిగేన
ఆ చిత్రమే గమనిస్తున కొత్తగా
నువు విన్నది నీ పెరైన నిను కాదని అనిపించేన
ఆ సంగతి కనిపెదుతున్న వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదెన అనుకుంటున్న
నా పెరుకి ఓ తీయ్యదనం నీ పెదవే అందించేనా
అది నువ్వే అని నువ్వే చెపుతూవున్న
లల లల లైలైలే లల లల లైలైలే (2)

వెన్నంటే ఉంటున్న - అందాల రక్షసి .. రచన : కృష్ణకాంత్

వెన్నంటే ఉంటున్న కడదాకా వస్తున్న నా ప్రాణం నీదన్న ప్రేమ 
నీ నవ్వుల తానన నేనేపుడో పడిపోయా తప్పంతా నీదెగా ప్రేమ 
అరకొరగా సరిపోన కసరకలా సరే పోనా 
కోపంగా చూస్తున్న నీ నవ్వై నే రానా 
bus ఎక్కిన నెరజాణ  
ఆఖే దిల్ మే బస్ జాన 
మిస్సయ్యిన Missile లాగ నాపై fire ఎలా 
అటు ఇటు ఎటు పరిగెడుతున్న వేణు తిరిగితే నేనే ఉన్న 
అలుపెరుగని సుర్యున్నేనే నాతో పంతాల 
పారిపోకే నువ్వు డే టైముల్లో ఉన్నట్టేలే నా ఒళ్లొ 
జారిపోకే రాతిరి రహదారుల్లో Moon అయ్యి రానా mufti లో 
కదిలించే నిదురవన  
భాదించే హాయినవనా 
కలబడితే గెలుపవనా 
విసురుగ నన్నే విసిరేసిన 
నను తరిమే దూరమవన 
నిను తరిమే ఖరమవన (ఖరము = బాణం) 

చుక్కల్లో దాక్కున్నా  నీ పక్కన నేనున్నా 
ఉరికే నది ఎటు చూస్తున్నా నే లేన 
ఊ అంటే నిజమవుతా కాదంటే కల నవుతా 
వద్దన్నా ఎదురవుతా లేమ్మా 
స్వర్గంలో నేనుంట నీకోసం చూస్తుంట 
మొదలైన మరు జన్మ మారదులే నీ కర్మ 

ఏమిటో ఇవాళ -- అందాల రక్షసి రచన: రాకెందు మౌళి

శపించెనే నన్ను నా గతం  
ఆలస్యమైందని తనకు నీ పరిచయం 
నువ్వేనట ఇకపై నా జీవితం 
శాపమైనా వరంలా తోచేలే ఈ క్షణం 

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా అకశమంచు తాకుతున్న 
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి 
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా 
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...


ఆగని ప్రయాణమే యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా
నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించిన నీ ప్రేమ వాళ్ళ పొందుతున్న హాయి ముందు ఓడిపోవే
జారిందిలే ఝల్లంటూ వాన చినుకు తాకి తదిసిందిలే నా ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా

గుండెలో చేరావుగా ఉఛ్వాసల మారకే నిఛ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా  నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనే నిండిపోకల నిజంలోకిరా
కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకువే కలై చూపే 
ఏం మార్పిడి నీ మీద ప్రేమ పుట్టుకోచ్చె ఏం చేయను నువ్వే చెప్పవా 
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా 

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా అకశమంచు తాకుతున్న 
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి 
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా 
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...