శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సయంత్రమీనామసంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి, నీ మీత నే దండకంబొక్కటించేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి, నీయందమున్నెంచి, నీ దాసదాసుండనై, రామ భక్తుండనై, నిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, అంజనాదెవికర్బాన్వయా! దేవా!
నిన్నెంచ నేనెంత వాడన్ దయాశలివై జూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవకున్ మంత్రివై, స్వామి కర్యర్థివై యుండి, శ్రీరామసౌమిత్రలం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుత్ స్థ స్వామిన్ దయాద్రుష్టి వీక్షించి, కిష్కిందకేతెంచి, శ్రీ రామ కార్యార్తివై, లంకకేతెంచియున్, లంకిణిన్ జంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజున్ జూచి, యానందముప్పంగ, నా యుంగరంబిచ్చి, యా రత్నమున్ దెచ్చి, శ్రీరామకున్ యిచ్చి, సంతోషమున్ గూర్చి, సుగ్రీవుడాయంగ దాజాంబవంతలంగూడి , యాసేతువున్ దాటి, వానరానీకముల్పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా, నా రావణుడంత కాలగ్ని రూపోగ్రుడై, కోరి భ్రహ్మండమైనట్టి, యాశక్తినిన్ వేసి, యా లక్షమణున్ మూర్ఛనొందింపగా నప్పుడే బోయి, సంజేవినిన్ దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి, ప్రాణంబు రక్షించియున్, కుంభకర్ణాదులన్, వీరులన్ బోరి, శ్రీ రామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంత లోకంబులానందమైయుండు నవేళలోనన్ విభీషణాక్యున్, వేడుకన్ దోడుకన్వచ్చి, పట్టాభీషేకంబు సమ్రంభమై యున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్, రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నేనామ సంకీర్తనల్ చేసినన్ పాపముల్ బాయవే, క్లేశముల్ దీరవే, భగ్యముల్ గల్గవే, సామ్రాజ్యముల్ సర్వసంపద్విశేషంబులున్ గల్గవే?
వానరాకార! ఓ భక్తమందార! ఓ పున్యసంచార! ఓ ధీర! ఓ శూర! నీవే నా సమస్తంబునన్ వజ్ర దేహంబునున్ దాల్చి, శ్రీ రామ శ్రీ రామ యంచున్, మనఃపూతమై, యెప్పుదున్ తప్పకన్ జిహ్వయందుండినన్ ధీర్గదేహానత్రైలోక్యసంచరివై, రామ నామాంకితధ్యనివై, బ్రహ్మవై, బ్రహ్మతెజంబునన్ బట్టి, దేవా! హనుమంత! ఓంకార సబ్దంబులన్, కృరసర్వగ్రాహానీకమున్, భూతబేతాళ, సంఘాది పైశాచులన్, శాకినీ, డాకినీ, మోహినీత్యాది దయ్యంబులన్, రోమఖండంబులన్, ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై, బ్రహ్మప్రభాబాసితంబైన, నీదివ్య తేజంబునున్ జూపితే, నా ప్రేమపున్నారసింహా! యటంచున్, దయాదౄష్టివీక్షించి, నన్నేలు నా స్వామి నాథా! నమస్తే! సదా బ్రహ్మచారీ! నమస్తే ప్రపూర్ణార్తి హారీ! నమో వాయుపుత్రా! నమస్తే! నమస్తే!! నమః
No comments:
Post a Comment