అదే నీవు....
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా |2|
కధైనా కలైనా కనులలో చూడనా |అదే నీవు |
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము |2|
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము |2|
ఆది అంతము ఏదీ లేని గానము |అదే నీవు|
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు |2|
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశగా |2|
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను |అదే నీవు|
మంచు కురిసే.........
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో |2|
మంచు కురిసే వేళలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో |2|
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో |2|
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో |మంచు కురిసే|
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో |2|
మన్మధునితో జన్మ వైరం సాగినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో |2|
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో |మంచు కురిసే|
No comments:
Post a Comment