SriRama Dasu - Kancharla Gopanna

చరణములే నమ్మితీ.......

చరణములే నమ్మితీ, నీ దివ్య చరణములే నమ్మితీ (2)
చరణములే నమ్మితీ

వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ

పావన రామ నామ సుధా రస పానము చేసే దెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నెంచే దెన్నటికో

రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జయరామా

చంచల గుణములు మాని సదా నిశ్చల మదియై నుండే దెన్నటికో
పంచ తత్వములు తారక నామము పఠియించుట నాకెన్నటికో

|రామ రామ |
నందబాలం భజరే నందబాలం, బౄందావన వాసుదేవ వౄందలోలం (2)

జలజ సంభవాది వినుతా (5)
చరణారవిందం కౄష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం

నందబాలం భజరే నందబాలం, బౄందావన వాసుదేవ వౄందలోలం (2)

శ్రీరామ నామం మరువాం మరువాం, సిద్దము యమునికి వెరువాం వెరువాం (2)
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం (2)
దేవుని గుణములు తలుతాం తలుతాం (2)
శ్రీరామ నామం మరువాం మరువాం, సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం, విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం, వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం, సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామా..జానకి రామాజై జై రామా
జానకి రామాపావన నామా, పట్టాభి రామాపావన నామా
పట్టాభి రామానిత్యము నిన్నే, కొలిచెద రామా
అహ నిత్యము నిన్నే కొలిచెద రామా
ఆహా రామా అయోధ్య రామా (2)
రామా రామా రఘుకుల సోమా
అహ రామా రామా రఘుకుల సోమా
జై జై రామా జానకి రామా (3)
రామా రామా !






నను బ్రోవమని చెప్పవే...

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే (2)
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా, జననీ జానకమ్మా |నను బ్రోవమని |
లోకాంతరంగుడు, శ్రీకాంత నిను గూడి..ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళ |నను బ్రోవమని|
ఆద్రీజావినుతూడు..భధ్రగిరీశుడు..నిద్రా మేల్కొనూ వేళ..నెరతలో భోధించి
నను బ్రోవమనీ, నను బ్రోవమనీ, |నను బ్రోవమని|





అంతా రామమయం.........

అంతా రామమయం ఈ జగమంతా రామమయం.
రామ రామ రామ రామ రామ రామ రామ

|అంతా రామమయం| (3)

అంతరంగమున ఆత్మారాముడు..
రామ రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు

|అంతా రామమయం|
ఓం నమో నారాయణాయ (3)

అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానమౄగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం
రామ(7)

సిరికిన్ జెప్పడు..శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు..అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ..
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ..
గజప్రాణావనోత్సాహియై !


శుద్దబ్రహ్మ పరాత్పర రామా...

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా (2)

శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా(2)

రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా(2)

ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా(2)

హనుమత్సేవిత నిజపద రామా..సీతా ప్రాణా ధారక రామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా(2)

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా(2)
అదిగో అదిగో భద్రగిరి

ఓం, ఓం, ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కథగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకౄత రామపదామౄత వాగ్గేయస్వర సంపదగావెలసిన దక్షిణ సాకేతపురీ
అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ


రాం .. (4)
రామనామ జీవన నిర్మిత్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూ
త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ

ధరణిపతియే ధరకు అల్లుడై శంఖచక్రములు అటు ఇటు కాగా..
ధనుర్బాణములు తనువై పోగా, సీతాలక్ష్మణ సమితుడై..
కొలువు తీరె కొండంత దేవుడూ

శిలగా మళ్ళీ మలచీ, శిరమును నీవే నిలచీ..
భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ

వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనంభద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతింసౌమిత్రి యుక్తం భజే !

|అదిగో అదిగో భద్రగిరి|




ఏ తీరుగ నను దయజూజెచదవో....

శ్రీరఘునందన సీతా రమణా
శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామ

ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామ
నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామ

వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామ
భాసుర వర సద్గుణములు కల్గిన భధ్రాద్రీశ్వర రామ

ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామ

జయ జయ రాం(12)


అల్లా శ్రీరామా (2)
శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడెవడూ?
కళ్యాణగుణగణుడు, కరుణా ఘనాఘనుడు ఎవడూ?
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ?
ఆనందనందనుడు, అమౄతరసచందనుడు, రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ !

తాగరా శ్రీరామనామామౄతం, ఆ నామమే దాటించు భవసాగరం (2)
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ..
ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ |తాగరా|


ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ
ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ |తాగరా|


పలుకే బంగారమాయెనా....

కలలో నీ నామ స్మరణ, మరువ చక్కని తండ్రీ (2)
పిలిచిన పలుకవేమి..పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా..

పలుకే బంగారమాయెనా, పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ | పలుకే|

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ (2)
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ ! | పలుకే |
పలుకే బంగారమాయెనా..

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా (2)
కరుణించు భధ్రాచల వర రామ దాసపోషా | పలుకే (2)|





ఇక్ష్వాకు కుల తిలకా...

ఇక్ష్వాకు కుల తిలకా, ఇకనైన పలుకవే
రామచంద్రా నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా

చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకమూ రామచంద్రా ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికీతు రాయి నీకూ కొలుపుగా జేయిస్తినీ
రామచంద్రా నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా !
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా (2)

No comments: