లలిత ప్రియ కమలం..
లలిత ప్రియ కమలం విరిసినదీ (2)
కన్నుల కొలనిడి..ఆ
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని .. ఆ (2)
అమృతకలశముగా ప్రతినిమిషం (2)
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
|లలిత|
రేయీ పగలూ కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నెలా నింగీ కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరులవనం మన హృదయం (2)
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి ఈ రాగ చరితరగల మ్రుదురవళీ
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను
|లలిత |
కన్నుల కొలనిడి..ఆ ఉదయ రవికిరణం మెరిసినదీ
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినదీ (2)
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని ఆ
|లలిత|
కన్నుల కొలనిడి..ఆ
|లలిత|
నమ్మకు నమ్మకు ఈ రేయినీ..
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటీ వెచ్చనైన ఊసులెన్నో రెచ్చ గొట్టు సీకటీ
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి ముద్దుగా ఇద్దరికే వొద్దికైన సీకటీ
పొద్దుపొడుపేలేని చీకటే ఉండిపోనీ మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామ సిలకా సద్దుకుపోయే సీకటెనకా..
నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. కమ్ముకు వచ్చిన ఈ మాయని (2)
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
| నమ్మకు |
వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకూ
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
|నమ్మకు|(2)
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో (2)
పుడమిని చూడని కన్నూ నడపదు ముందుకు నిన్నూ
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారికి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా(2)
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు..
నమ్మకు నమ్మకు..అరె నమ్మకు నమ్మకు
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
సీతకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా (2)
మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా (2)
ఆనాడు వాసంత గీతాలు పలుకును కాద
మ..గసమ..దమద..నిదని
మమమమగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ
| నమ్మకు |
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
| నమ్మకు |
చెప్పాలని ఉంది.....
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్ఠం వస్తేనే కద గుండెబలం తెలిసేది దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచైనా..చెడ్డైనా పంచుకోను నేలేనా ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది (3)
గుండెల్లో సుడి తిరిగే కలత కధలూ
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది ! (3)
కోకిలలకు కొమ్మల్లో చెడబుట్టిన కాకిని అనీ అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకినీ (2)
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !(2)
పాత బాట మారాలని చెప్పటమేనా నేరం గూడు విడిచిపొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం..విరబూసే ఆనందం తేటి తేనె పాట..పంచె వన్నెల విరి తోట
బ్రతుకు పుస్తకం లో ఇది ఒకటేనా పుట మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటా
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటా
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది ! (2)
ఏటిపొడుగునా వసంతమొకటేనా కాలం ఏదీ మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడూ కంటి నీటి కుంభవృష్ఠి జడిలో ఇంకొకడు
మంచి వంచను మోడై గోడు పెట్టువాడొకడు
వీరి గొంతులో కేక వెనుక ఉన్నదే రాగం అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్త కోకిలా కళ్ళు ఉన్న కబోదిలా..చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడా..కరువాయెను నా స్ఠానం
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది ! (2)
అసహాయతలో దడ దడలాదే హృదయ మృదంగ ధ్వానం నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారూ దిక్కూ మొక్కూ తెలియని దీనుల యదార్ధ జీవన స్వరాలూ
నిలువునా నన్ను కమ్ముతున్నాయి..శాంతితో నిలువనీయకున్నాయి ఈ తీగలు సవరించాలి..ఈ అపశృతి సరిచెయ్యాలి
జనగీతిని వద్దనుకుంటూ..నాకు నేనె పెద్దనుకుంటూ కలలో జీవించను నేను..కలవరింత కోరను నేనూ
నేను సైతం విశవీణకు తంత్రినై మూర్ఛనలు పోతానూ
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తానూ
నేనుసైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తానూ
నేను సైతం .. నేను సైతం బ్రతుకు బాటకు గొంతుకలిపేనూ (2)
సకలజగతికి శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనం లో నందనం వికసించు దాకా
పాత పాటను పాడలేనూ..కొత్త బాటను వీడి పోనూ (2)
నేను సైతం .. (8)
తరలిరాద తనే వసంతం !
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం(2)
గగనాల దాకా అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా
|తరలిరాద |
వెన్నెల దీపం కొందరిదా..అడవిని సైతం వెలుగు కదా (2)
ఎల్లలులేనీ చల్లని గాలీ అందరికోసం అందునుకాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద !
|తరలిరాద |
బ్రతుకున లేనీ శృతి కలదా.. ఎదసడిలోనే లయలేదా (2)
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదు కద !
|తరలిరాద|
|గగనాల|
|తరలిరాద|
No comments:
Post a Comment