Malleswari (old) -- మనసున మల్లెల

Film : Malleswari (old)
Singer : Bhanumathi
Lyrics : Devulapalli Krishnasaastri
Music : S.Rajeswara Rao.


మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో

కొమ్మల గువ్వలు గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా (2)
అలలు కొలనులో గలగలమనినా దవ్వుల వేణువు సవ్వడి వినినా (2)
నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయచూచితిని (2)

గడియయేని యిక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగులనీకుమా

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో

Contributed by Sharath Tadimarri

No comments: