అభినవ తారవో
అభినవ తారవో, నా అభిమాన తారవో (2)
అభినయ రసమయ కాంతిధారవో (2)
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనీ శివరంజనీ............
అది దరహాసమా మరి మధుమాసమా (2)
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా (2)
నా తరుణభావనా హరిణమ్ములా |అభినవ|
శివరంజనీ శివరంజనీ............
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు (2)
ఆ నెన్నడుము ఆడినచాలూ (2)
పదకవితా ప్రభంధాలు |అభినవ|
శివరంజనీ శివరంజనీ............
నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కసులైనా
వీరమా.. నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా.. నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ..మిన్నులందుకున్నవాడ
ఆ...................
నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తడనూ..
నీ ప్రియభక్తుడనూ |అభినవ |
శివరంజనీ శివరంజనీ............
జోరుమీదున్నావు తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికొసమే తుమ్మెదా (2)
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీవళ్ళు జాగరతే తుమ్మెదా (2) |జోరుమీదున్నావు |
ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరైకోసమే తుమ్మెదా |జోరుమీదున్నావు|
మెత్తన్ని పరుపూలు తుమ్మెదా గుత్తంగ కుట్టావు తుమ్మెదా
వత్తైన పరుపుపై తుమ్మెదా అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసి ఉంచావు తుమ్మెదా ఆ పక్కెవరికోసమే తుమ్మెదా |జోరుమీదున్నావు |
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీవళ్ళు జాగరతే తుమ్మెదా | జోరుమీదున్నావు |
No comments:
Post a Comment