జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా || 2 ||
మంగలకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాక
నీ.... పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక ||జగదానంద||
సార్వభౌమునిగ పూర్ణకుంబములె స్వాగతాలు పలికె
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే
నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రొగె
న్యాయ దేవతే శంకమూదగా పూలవాన కురిసె
రాజమకుటమే ఒసగెలె నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్షకి పరవసించె పొయె ||జగదానంద|| || 2||
రామ పాలనము కామధెనువని వ్యొమసీమ చాటే...
రామ శాసనము తిరుగులెనిదని జలధి బొధ చెసె
రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపె
రామ రాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమే తారకం భహు శక్తి ముక్తి సందాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే ||జగదానంద|| || 2||
మంగలకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాక
నీ.... పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక ||జగదానంద||
No comments:
Post a Comment